
Apple: ఈ ఏడాదిలో రాబోయే యాపిల్ కొత్త ఉత్పత్తులివే!
ఇంటర్నెట్‌డెస్క్: యాపిల్ ఏటా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంటుంది. గతేడాది ఐఫోన్13, వాచ్ సిరీస్7, మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్, ఎయిర్‌పాడ్స్ 3, ఐపాడ్ ప్రో, ఎమ్1 ఐమ్యాక్, మ్యాక్ బుక్ ప్రో, ఎయిర్ ట్యాగ్స్, యాపిల్ టీవీ 4కేలను తీసుకొచ్చింది. మరి 2022లో యాపిల్ తీసుకురానున్న ఉత్పత్తులేంటి.. వాటిలో ఎలాంటి ఫీచర్లుంటాయో చూద్దామా!
ఎప్పటిలాగే యాపిల్ ఈ ఏడాది కూడా ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్లివేనంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటితోపాటు కొత్త ఐపాడ్ ప్రో, మ్యాక్ ప్రో, ఐమ్యాక్ ప్రో, మ్యాక్ మినీ, అప్‌డేటెడ్ మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో మోడల్స్ తీసుకురానుంది. అయితే ఈసారి ఐఫోన్ 14తోపాటు మూడో జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ3ను తీసుకురానుంది. ఐఫోన్ ఎస్‌ఈ3 మోడల్‌ను మార్చి నెలలో, మిగిలిన ఉత్పత్తులను సెప్టెంబరు-అక్టోబరు మధ్య కాలంలో విడుదల చేస్తారని సమాచారం.
ఐఫోన్ ఎస్‌ఈ3 మోడల్‌లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్‌లెస్ డిస్‌ప్లే, 4.7 అంగుళాల హెచ్‌డీ రెటీనా డిస్‌ప్లే, వెనుక 12 ఎంపీ, ముందు 7 ఎంపీ కెమెరా ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో యాపిల్ 5ఎన్‌ఎమ్ ఏ15 బయోనిక్ చిప్ ఉపయోగించారట. ఐఫోన్ 14ను నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నారట. ఈసారి ఐఫోన్ 14 సిరీస్‌లో మినీ మోడల్ ఉండదని, కేవలం ఐఫోన్ 14, 14 మాక్స్, 14 ప్రో, 14 ప్రో మాక్స్ మోడల్స్ ఉంటాయని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిలో కూడా నాచ్‌లెస్ డిస్‌ప్లే, 5ఎన్‌ఎమ్ ఏ15 బయోనిక్ చిప్ ఉంటాయట. సాధారణ మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ప్రో మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్లే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్స్‌లో శాటిలైట్ నెట్ కనెక్టివిటీ ఫీచర్‌తోపాటు ఈ-సిమ్ ఉంటుందని భోగట్టా.
ఐపాడ్ ప్రో మోడల్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేయనున్నారట. అలానే యాపిల్ తన తొలి వీఆర్ హెడ్‌సెట్‌ను ఓక్ (Oak) అనే పేరుతో ఈ ఏడాదే విడుదల చేస్తుందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్మార్ట్‌వాచ్ శ్రేణిలో యాపిల్ రగ్‌డ్ స్మార్ట్‌వాచ్, వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్‌ఈ మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.