వాట్సాప్‌ భద్రంగా ఉండాలంటే..

సాధారణంగా ఏ విధమైన సామాజిక మాధ్యమాలైనా, ఏవైనా మొబైల్‌ యాప్స్‌లోనైనా వినియోగదారులు ఆశించిందేమిటంటే వ్యక్తిగత సమాచార భద్రత. దానికోసం యాప్స్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి.

Published : 08 Mar 2021 20:47 IST

ఈ ఐదు సూత్రాలు పాటించండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏ విధమైన సామాజిక మాధ్యమాలైనా, ఏవైనా మొబైల్‌ యాప్స్‌లోనైనా వినియోగదారులు ఆశించిందేమిటంటే వ్యక్తిగత సమాచార భద్రత. దానికోసం యాప్స్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫీచర్లు, అప్డేట్లు తీసుకొచ్చింది. అవన్నీ ఎనేబుల్‌ చేసుకొని వాట్సాప్‌ ఛాట్లను భద్రంగా ఉంచుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..

డిజప్పియరింగ్‌ మెసేజెస్‌..

వాట్సాప్‌ డిజప్పియరింగ్‌ మెసేజస్‌ ఫీచర్‌ను గతేడాది నవంబరులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకున్న తర్వాతి నుంచి ఆ ఛాట్‌లో ఉన్న మెసేజులు వారంరోజుల తర్వాత మాయమైపోతాయి. తాజాగా 24 గంటల్లో మెసేజులు డిలీట్‌ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ కృషిచేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఫీచర్‌ ఎలా పొందాలంటే.. వాట్సాప్‌లో ఒక కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి > అక్కడ ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి> వ్యూ కాంటాక్ట్‌లో >డిజప్పియరింగ్ మెసేజెస్‌ > ఆన్‌ చేయాలి.

టు స్టెప్‌ వెరిఫికేషన్‌..

ఇందుటో వాట్సాప్‌ యూజర్లకు అదనపు భద్రత కల్పిస్తోంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఇతరులెవరైనా మన వాట్సాప్‌ ఓపెన్‌ చేయకుండా ఒక పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌కు ఈ మెయిల్‌ అనుసంధానం చేసి ఉంటే దానికి ఒక లింక్‌ వస్తుంది. లేదంటే నేరుగా ఒక పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌> వాట్సాప్‌ సెట్టింగ్స్‌ > అకౌంట్‌> టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ > ఎనేబుల్ >ఆరు అంకెల పిన్‌ను ఎంటర్‌ చేయాలి.

టచ్‌/ఫేస్‌ ఐడీ..

మన ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్‌కు ఫింగర్‌ప్రింట్‌/ ఫేస్‌ ఐడీని పెట్టడం ద్వారా అదనపు భద్రతను అందించొచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే యాప్‌ నుంచి బయటకు రాగానే ఆటోమేటిగ్గా లాక్‌ ఐపోతుంది.

వాట్సాప్‌ >సెట్టింగ్స్‌ > అకౌంట్‌ > ప్రైవసీ > స్క్రీన్‌ లాక్‌.

బ్లాక్‌/ రిపోర్ట్‌ స్పామ్‌..

ఏదైనా అనుమానాస్పదమైన నంబర్‌, వ్యక్తులు, లేదా ఇబ్బంది కలిగించే వ్యక్తుల నుంచి భద్రంగా ఉండేందుకు ఆ కాంటాక్ట్‌ను బ్లాక్‌ చేయడం, స్పామ్‌గా రిపోర్ట్ చేయడం చేయాలి. వారి నుంచి మీ ప్రొఫైల్‌ ఫొటోను, లాస్ట్‌ సీన్‌, కాంటాక్ట్‌ వివరాలు వంటి వాటిని రక్షిస్తుంది.

గ్రూప్‌ సెట్టింగ్స్‌..

ప్రస్తుతం వాట్సాప్‌లో గ్రూపులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చుట్టాలు, ఫ్రెండ్స్‌, బిజినెస్‌ వేటికైనా గ్రూపులు ఉంటున్నాయి. వాటిల్లో మనకు తెలిసినవారు కొందరే ఉంటారు. వారి నుంచి మీ ఖాతాను రక్షించేందుకు గ్రూప్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి.

వాట్సాప్‌ >సెట్టింగ్స్‌ > అకౌంట్‌ > ప్రైవసీ > గ్రూప్స్‌ > వాటిలో ఎవరికి మీ వివరాలు తెలియాలనుకుంటారో వారిని ఎంచుకోండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు