Telegram Group Calling: సరికొత్త  టెలిగ్రామ్‌

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో ఆకర్షిస్తున్న టెలిగ్రామ్‌ మరిన్ని వినూత్న ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. వీటిల్లో ముఖ్యమైంది గ్రూప్‌ వీడియో కాల్స్‌ను విస్తృతం చేయటం. ఒక వీడియో కాల్‌ మీద 1,000 మంది  

Updated : 04 Aug 2021 16:47 IST

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో ఆకర్షిస్తున్న టెలిగ్రామ్‌ మరిన్ని వినూత్న ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. వీటిల్లో ముఖ్యమైంది గ్రూప్‌ వీడియో కాల్స్‌ను విస్తృతం చేయటం. ఒక వీడియో కాల్‌ మీద 1,000 మంది ప్రేక్షకులను అనుమతించనుంది. ఇందులో సుమారు 30 మంది వరకు తమ కెమెరా దృశ్యాలను, స్క్రీన్లను ప్రసారం చేసుకోవచ్చు. గ్రూప్‌ వీడియో కాల్‌ను ఆరంభించటానికి ముందుగా గ్రూప్‌ ఇన్ఫోపేజీ నుంచి అడ్మిన్లు వాయిస్‌ చాట్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీడియోను ఆన్‌ చేయాలి. అధిక రెజల్యూషన్‌లో వీడియో సందేశాలను పంపించుకోవటానికీ టెలిగ్రామ్‌ ఏర్పాటు చేసింది. వీడియో సందేశాల మీద ట్యాప్‌ చేసి పెద్దగానూ చూసుకోవచ్చు. వీటిని పాజ్‌ చేసుకోవచ్చు. వెనక్కు, ముందుకు జరిపి వీక్షించొచ్చు. రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు పరికరం మీద ఆడియో ప్లే అవుతూనే ఉంటుంది. ఇది వీడియో సందేశంలోనూ రికార్డు అవుతుంది. వెనక కెమెరా నుంచి వీడియో సందేశాన్ని రికార్డు చేస్తున్నప్పుడు దృశ్యాన్ని జూమ్‌ చేసుకునే ఫీచర్‌నూ జోడించింది. చూస్తున్న వీడియోల వేగాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోనూ వచ్చు. ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌లో ఐకాన్‌ మీద కనిపించే మూడు చుక్కలను తాకటం ద్వారా వీడియో ప్లేబ్యాక్‌ వేగాన్ని మార్చుకోవటానికి వీలుంటుంది. టైమ్‌స్టాంప్స్‌ మీద కాసేపు అలాగే నొక్కి ఉంచి వీటిని కాపీ చేసుకోవచ్చు. ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు.

ఆటోడిలీట్‌ సదుపాయమూ

టెలిగ్రామ్‌ తీసుకొస్తున్న మరో ముఖ్యమైన ఫీచర్‌ ఆటోడిలీట్‌. దీంతో నిర్ణయించుకున్న కాలం ముగియగానే సందేశాలు వాటంతటవే తొలగిపోతాయి. ప్రస్తుతం ఒక రోజు నుంచి ఒక వారం వరకు ఆటోడిలీట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవటానికి వీలుంది. త్వరలో దీన్ని నెల వరకూ పొడిగించుకోవచ్చు. ఫొటోలు, వీడియోలకు డ్రాయింగ్స్‌, టెక్స్ట్‌, స్టికర్లను జోడించి మరింత కచ్చితమైన కొలతలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునే సదుపాయమూ లభించనుంది. ఫొటోను జూమ్‌ చేస్తే బ్రష్‌ సైజు దానంతటదే చిన్నగా అవుతుంది కూడా. కంప్రెస్‌ చేయకుండానే ఫైళ్లను పంపించుకోవటానికీ వీలుంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోతే కొత్త పాస్‌వర్డ్‌ రీసెట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. రికవరీ ఈమెయిల్‌ లేకపోయినా ఇది పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని