Android 14: ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్ గుడ్‌ న్యూస్‌

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యూజర్లు గూగుల్ శుభవార్త చెప్పింది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా... 

Published : 02 Sep 2022 21:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్స్‌కు శాటిలైట్‌ కనెక్టివిటీ.. గత కొన్ని రోజులుగా టెక్‌ ప్రపంచంలో దీని గురించే చర్చ నడుస్తోంది. ఐఫోన్ 14 మోడల్స్‌లో ఈ సాంకేతికత ఉంటుందని వార్తలు వచ్చినప్పటి నుంచీ టెక్‌ వరల్డ్‌లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోనూ ఇలాంటి సాంకేతికత ఉంటుంది అని గూగుల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దీంతో త్వరలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హిరోషీ లొషెమెర్‌ ట్వీట్ చేశారు.

రాబోమే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నాం. దీని కోసం మా భాగస్వాముల నుంచి సహకారం తీసుకుంటున్నాం

- ట్వీట్‌లో హిరోషీ లొషెమెర్‌

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. దాని బీటా వెర్షన్‌లో శాటిలైట్‌ కనెక్టివిటీ లాంటి ఆప్షన్లు కనిపించలేదు. అంతేకాదు త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాబట్టి 13లో ఈ కీలక మార్పు ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 14లోనే ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

2023లో స్పేస్‌ఎక్స్‌

ప్రపంవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో టీ-మొబైల్‌, స్పేస్‌ఎక్స్‌ కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటన చేశాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాలకు స్టార్‌లింక్‌ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించాయి. 2023లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కూడా తెలిపాయి. ఇప్పటికే స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కనెక్టివిటీతో విదేశాల్లో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ  ఈ  తరహా సేవలను ప్రారంభించాలని భావించినా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని