హ్యాకర్ల బెడద తప్పేలా...

దొంగల బెడద తప్పించుకోవడానికి ఇళ్లకు కరెంటు తీగల రక్షణ పెట్టుకోవడం చూస్తున్నాం.....

Updated : 22 Nov 2022 15:22 IST

దొంగల బెడద తప్పించుకోవడానికి ఇళ్లకు కరెంటు తీగల రక్షణ పెట్టుకోవడం చూస్తున్నాం. త్వరలో అదే కరెంటుతో హ్యాకర్ల దాడిని ఎదుర్కోవచ్చు. మిచిగాన్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న సాంకేతికతతో ఇది సాధ్యమవుతుంది. సమాచారాన్ని దోచుకోవడానికి హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉన్న గ్యాడ్జెట్లు, పరికరాలకు విద్యుత్తు సరఫరా ద్వారానే సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించడం ఈ సాంకేతికత విధానం. విద్యుత్తును అందించే గ్రిడ్ల నుంచే ఈ రక్షణ ప్రక్రియ మొదలవుతుంది. దీని కోసం పవర్‌ గ్రిడ్లలో చేయాల్సిన మార్పులను కూడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. బ్లడ్‌ ప్రెజర్‌ను పర్యవేక్షించేంత సులభంగా ఈ ప్రక్రియ ఉంటుందని విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికత ఆచరణలోకి వస్తే ఇబ్బందులు తప్పుతాయన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని