హాకింగ్‌ బోర్డు గుట్టు?

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉండేవి? మనకెలా తెలుస్తుందని అనుకోవటంలో తప్పులేదు. ఆయన వాడిన నల్ల బోర్డు మీది బొమ్మలు, అక్షరాలను చూసైనా పసిగట్టొచ్చేమో?

Published : 23 Feb 2022 01:05 IST

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉండేవి? మనకెలా తెలుస్తుందని అనుకోవటంలో తప్పులేదు. ఆయన వాడిన నల్ల బోర్డు మీది బొమ్మలు, అక్షరాలను చూసైనా పసిగట్టొచ్చేమో? సైన్స్‌ మ్యూజియం ఆఫ్‌ లండన్‌ తాజా ప్రదర్శన ఇలాంటి ప్రశ్నే సంధిస్తోంది. ‘స్టీఫెన్‌ హాకింగ్‌ ఎట్‌ వర్క్‌’ పేరిట ఆరంభించిన ఇందులో ఆయన చక్రాల కుర్చీ, 1966 పీహెచ్‌డీ థిసీస్‌ ప్రతి, చిన్న గాజు యాపిల్‌ వంటి వస్తువులను ప్రదర్శిస్తున్నారు. వీటిల్లో నల్ల బోర్డు కూడా ఉండటం విశేషం. ఇది హాకింగ్‌ 1980లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఉపయోగించింది. దీని మీద రకరకాల క్యారికేచర్లు, డూడుల్స్‌, గణిత సూత్రాలు ఉన్నాయి. వీటి అంతరార్థమేంటన్నది ఎవరికీ అంతు పట్టటం లేదు. ఇందులో చిరకాల రహస్యాలు... వినూత్న ఆవిష్కరణల ఆనవాళ్లు ఏవైనా ఉన్నాయా? అనేవి తెలియటం లేదు. అప్పట్లో ఆయనకు సహాయకులుగా పనిచేసినవారెవరైనా ఈ బోర్డును చూస్తే ఏదైనా చెప్పగలరేమోనని ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని