కీటకాల ఘ్రాణశక్తికి కాలుష్యం మసి

వాయు కాలుష్యం కీటకాల వాసన శక్తినీ దెబ్బతీస్తోంది. అయితే మనకేంటని అనుకుంటున్నారేమో. తేనెటీగలు, సీతాకోక చిలుకల వంటి కీటకాల వాసన శక్తి తగ్గితే పంటల దిగుబడీ తగ్గుతుంది!....

Updated : 02 Mar 2022 06:28 IST

వాయు కాలుష్యం కీటకాల వాసన శక్తినీ దెబ్బతీస్తోంది. అయితే మనకేంటని అనుకుంటున్నారేమో. తేనెటీగలు, సీతాకోక చిలుకల వంటి కీటకాల వాసన శక్తి తగ్గితే పంటల దిగుబడీ తగ్గుతుంది! పుప్పొడిని వ్యాపింపజేసి, పరాగ సంపర్కానికి కారణమయ్యేవి కీటకాలే మరి. తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి కీటకాలు తమ తల మీదుండే యాంటెనాల వంటి భాగాలతో వాసన పసిగడతాయి. పువ్వులు రసాయన మిశ్రమాలను వెదజల్లినప్పుడు అవన్నీ ఒక మేఘంలా ఏర్పడతాయి. కీటకాలు దీన్ని ఒక పటంగా ఊహించుకొని, విశ్లేషించుకుంటాయి. విడివిడిగా ఆయా రసాయనాలను గుర్తిస్తాయి. ఒకవేళ గాలి కాలుష్యం మూలంగా ఏదైనా రసాయనం ప్రభావితమైతే ‘పటం’లోని రసాయనాల శాతం, మోతాదులూ మారిపోతాయి. దీంతో వాసనలు ఏ పువ్వులకు సంబంధించినవనేది కీటకాలు గుర్తించలేవు. డీజిల్‌ పొగ, ఓజోన్‌ ప్రభావంతో ఇలాంటి అనర్థమే వాటిల్లుతున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవల గుర్తించారు. కీటకాలు పువ్వులపై వాలటం డీజిల్‌ ప్రభావంతో 89%, ఓజోన్‌ ప్రభావంతో 83% వరకు తగ్గటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని