అవుట్‌లుక్‌ మెయిల్‌లో అన్‌డూ ఎలా?

అవుట్‌లుక్‌ వెబ్‌ ద్వారా మెయిల్‌ పంపించాం. అంతలో ఏదో తప్పు దొర్లిందని అనిపించొచ్చు. లేదూ ఫైల్‌ అటాచ్‌ చేయటం మరచిపోయి ఉండొచ్చు. పొరపాటున వేరేవారికి సెండ్‌ చేసి ఉండొచ్చు. అయినా ఆందోళన అవసరం లేదు. అవుట్‌ లుక్‌ వెబ్‌ ద్వారా

Published : 06 Jul 2022 00:53 IST

అవుట్‌లుక్‌ వెబ్‌ ద్వారా మెయిల్‌ పంపించాం. అంతలో ఏదో తప్పు దొర్లిందని అనిపించొచ్చు. లేదూ ఫైల్‌ అటాచ్‌ చేయటం మరచిపోయి ఉండొచ్చు. పొరపాటున వేరేవారికి సెండ్‌ చేసి ఉండొచ్చు. అయినా ఆందోళన అవసరం లేదు. అవుట్‌ లుక్‌ వెబ్‌ ద్వారా పంపించిన మెయిల్‌ను 10 సెకన్లలో అన్‌డూ చేసుకోవచ్చు. ఇందుకు అవుట్‌లుక్‌ మెయిల్‌ సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
* బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి, అవుట్‌లుక్‌లో సైన్‌ ఇన్‌ కావాలి.
* కుడివైపున పైన కనిపించే గేర్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు సెటింగ్స్‌ మెనూ కనిపిస్తుంది.
* మెనూలో కిందికి వెళ్లి ‘వ్యూ ఆల్‌ అవుట్‌లుక్‌ సెటింగ్స్‌’ ఆప్షన్‌ను నొక్కాలి.
* తర్వాత ఎడమ వైపున ‘ఈమెయిల్‌’ మీద క్లిక్‌ చేసి ‘కంపోజ్‌ అండ్‌ రిప్లయి’ని నొక్కాలి.
* పక్కన మెనూలో కిందికి వెళ్తే ‘అన్‌డూ సెండ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.
* స్లైడర్‌ ద్వారా ఎంత సేపట్లో అన్‌డూ చేయాలో సెట్‌ చేసుకోవాలి.
* అనంతరం సేవ్‌ చేసుకొని, అవుట్‌లుక్‌ హోం పేజీలోకి రావాలి.
* దీన్ని ఒకసారి సెట్‌ చేసుకుంటే చాలు. మెయిల్‌ను సెండ్‌ చేసినప్పుడు బ్రౌజర్‌ కింద అన్‌డూ ఫీచర్‌ కనిపిస్తుంది. మన నిర్ణయించుకున్న సమయం వరకే ఇది ఉంటుంది. పొరపాటున ఎవరికైనా మెయిల్‌ను పంపించినప్పుడు ఆ సమయంలోపు అన్‌డూ సెండ్‌ బటన్‌ను నొక్కితే డ్రాఫ్ట్‌ స్థితిలో వెనక్కి వచ్చేస్తుంది. కావాల్సినట్టు మార్చుకొని తిరిగి సెండ్‌ చేసుకోవచ్చు. లేదూ మొత్తానికే డిస్కార్డ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని