నోకియా కొత్త ఫీచర్‌ ఫోన్లు

నోకియా తాజాగా అప్‌గ్రేడ్‌ చేసిన రెండు కొత్త ఫీచర్‌ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు నోకియా 8210 4జీ, నోకియా 110. నోకియా 8210 4జీ పెద్ద బ్యాటరీని కలిగుంటుంది.  ఇది ఏకంగా 27 రోజుల పాటు పనిచేస్తుంది. రెండు వోల్టే సిమ్‌లను అమర్చుకోవచ్చు.

Updated : 30 Aug 2022 16:17 IST

నోకియా తాజాగా అప్‌గ్రేడ్‌ చేసిన రెండు కొత్త ఫీచర్‌ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు నోకియా 8210 4జీ, నోకియా 110. నోకియా 8210 4జీ పెద్ద బ్యాటరీని కలిగుంటుంది.  ఇది ఏకంగా 27 రోజుల పాటు పనిచేస్తుంది. రెండు వోల్టే సిమ్‌లను అమర్చుకోవచ్చు. దీంతో మాట స్పష్టంగా వినిపిస్తుంది. నోకియా 110లో బిల్టిన్‌గా వెనక కెమెరా ఉంటుంది. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో, ఆటో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌, అధిక స్టోరేజీ సదుపాయాలూ ఉన్నాయి. నీలి, ఎరుపు రంగుల్లో లభించే నోకియా 8210 4జీ ధర రూ.3,999. సియాన్‌, నలుపు రంగుల్లో ఉండే నోకియా 110 ధర రూ.1,699. గులాబి బంగారు రంగు ఫోన్‌ కావాలంటే మరో  వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని