ఐఓఎస్‌ బాటలో వాట్సప్‌ ఎడిట్‌!

ఐఓఎస్‌ 16 వర్షన్‌తో ఐఫోన్‌ కొంగొత్త ఫీచర్లను సంతరించుకున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఒకటి పంపించిన మెసేజ్‌లను సరిదిద్దుకోవటం, అవసరమైతే ఆ మెసేజ్‌లను వెనక్కి తీసుకోవటం.

Published : 19 Oct 2022 00:30 IST

ఐఓఎస్‌ 16 వర్షన్‌తో ఐఫోన్‌ కొంగొత్త ఫీచర్లను సంతరించుకున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఒకటి పంపించిన మెసేజ్‌లను సరిదిద్దుకోవటం, అవసరమైతే ఆ మెసేజ్‌లను వెనక్కి తీసుకోవటం. తప్పులు టైప్‌ చేసేవారికి, పొరపాటున మెసేజ్‌లు పంపించినవారికిది వరమనీ అనుకోవచ్చు. ఇప్పుడు వాట్సప్‌ సైతం ఇలాంటి ఫీచర్‌ను తీసుకురావటంపై దృష్టి సారించింది. వచ్చే డెస్క్‌టాప్‌ యాప్‌ అప్‌డేట్‌లో మెసేజ్‌లను ఎడిట్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్టు వాట్సప్‌ అప్‌డేట్లను ట్రాక్‌ చేసే వాబీటాఇన్ఫో పేర్కొంది. వాట్సప్‌ వినియోదారులు ఇలాంటి ఫీచర్‌ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు త్వరలో ఇది సాకారం కానుంది. దీంతో మెసేజ్‌ను పంపించాక 15 నిమిషాల్లో సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అవతలివారికి దాన్ని ఎడిట్‌ చేసిన సంగతి తెలిసేలా కొత్త ట్యాగ్‌ను జోడించటానికీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలోనే ఉంది. మున్ముందు మరిన్ని కొత్త సొబగులు అద్దుకోవచ్చు. బిజినెస్‌ యూజర్ల కోసం కొత్త పెయిడ్‌ సర్వీస్‌ మీదా వాట్సప్‌ పరీక్షలు జరుపుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవటానికి ఇందులో కొత్త టూల్స్‌ ఉండనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌ చాట్‌లో 1024 మంది వరకు పాల్గొనేలా చేసే సదుపాయాన్ని కల్పించటానికీ వాట్సప్‌ ప్రయత్నాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని