మ్యాక్‌లో కాపీ-పేస్ట్‌కు పాజ్‌

పెద్ద ఫైళ్లు, ఫోల్డర్లు కాపీ, పేస్ట్‌ చేస్తున్నప్పుడు చాలా సమయం పడుతుంది. ఇది పూర్తయ్యేవరకు సిస్టమ్‌ వేగం తగ్గుతుంది. కాపీ అయ్యేంతవరకు చూస్తూ ఉండటం తప్ప చేయటానికేమీ ఉండదు.

Published : 09 Mar 2022 00:55 IST

పెద్ద ఫైళ్లు, ఫోల్డర్లు కాపీ, పేస్ట్‌ చేస్తున్నప్పుడు చాలా సమయం పడుతుంది. ఇది పూర్తయ్యేవరకు సిస్టమ్‌ వేగం తగ్గుతుంది. కాపీ అయ్యేంతవరకు చూస్తూ ఉండటం తప్ప చేయటానికేమీ ఉండదు. క్యాన్సిల్‌ చేస్తే తిరిగి కథ మొదటికి వస్తుంది. అప్పటివరకు కాపీ అయినదంతా పోతుంది. మళ్లీ మొదట్నుంచి కాపీ చేయాల్సి వస్తుంది. కానీ మ్యాక్‌ఓఎస్‌ మాంటెరీతో (మ్యాక్‌ఓఎస్‌ 12) కూడిన మ్యాక్‌ సిస్టమ్‌ వాడేవారికి మాత్రం ఇది ఇబ్బంది కానే కాదు. మాంటెరీ విడుదలతోనే యాపిల్‌ సంస్థ కాపీ, పేస్ట్‌ ప్రక్రియను పాజ్‌ చేసుకునే వెసులుబాటూ కల్పించింది మరి. దీంతో మ్యాక్‌ను యథావిధిగా వాడుకుంటూనే వీలున్నప్పుడు కాపీ, పేస్ట్‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. పాజ్‌ చేసిన దగ్గర్నుంచే ఫైళ్లు కాపీ అవుతాయి. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలని అనుకుంటే మామూలుగానే కాపీ, పేస్ట్‌ చేయాలి. ఎంత డేటా కాపీ అయ్యింది? ఇంకెంత మిగిలింది? ఎంత సమయం పడుతుంది? అనే వివరాలు విండోలో కనిపిస్తాయి. అంత సమయం లేదనిపించినప్పుడు క్లోజ్‌ (ఎక్స్‌) బటన్‌ను క్లిక్‌ చేస్తే చాలు. కాపీ ప్రక్రియ అప్పటికి అలాగే ఆగిపోతుంది. కాపీ అవుతున్న ఫైళ్లు డెస్టినేషన్‌ లొకేషన్‌లో పారదర్శక రూపంలో కనిపిస్తాయి. తిరిగి కాపీ చేసుకోవాలనుకుంటే ఈ ఫైళ్ల మీద క్లిక్‌ చేస్తే సరి. అప్పుడు ఫినిష్‌ కాపీయింగ్‌, కీప్‌ ద రిజ్యూమేబుల్‌ కాపీ ఆప్షన్లు కనిపిస్తాయి. ఫినిష్‌ కాపీయింగ్‌తో వెంటనే కాపీ చేసుకోవచ్చు. తర్వాత కాపీ చేసుకోవాలనుకుంటే కీప్‌ ద రిజ్యూమేబుల్‌ కాపీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని