ఇన్‌స్టాలో రీడ్‌ రిసిప్ట్స్‌ ఆఫ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవారి చిరకాల కోరిక త్వరలో తీరనుంది. డైరెక్ట్‌ మెసేజెస్‌లో రీడ్‌ రిసిప్ట్స్‌ టర్న్‌ఆఫ్‌ చేసుకునే సదుపాయం రానుంది. దీంతో సందేశాలను చూశామని అవతలివారికి తెలియకుండా ఉంటుంది.

Published : 15 Nov 2023 01:29 IST

ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవారి చిరకాల కోరిక త్వరలో తీరనుంది. డైరెక్ట్‌ మెసేజెస్‌లో రీడ్‌ రిసిప్ట్స్‌ టర్న్‌ఆఫ్‌ చేసుకునే సదుపాయం రానుంది. దీంతో సందేశాలను చూశామని అవతలివారికి తెలియకుండా ఉంటుంది. ఇప్పటివరకూ రహస్యంగా సందేశాలను చదవటానికి ముందుగా ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది. రీడ్‌ రిసిప్ట్స్‌ టర్న్‌ఆఫ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇలాంటి దొడ్డిదారి పని తప్పుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవారు కొన్నిసార్లు కొందరి మెసేజ్‌లు డీఎంకు రావొద్దని భావిస్తుంటారు. ఎందుకంటే వారి మెసేజ్‌లను చదివితే జవాబులనూ ఆశిస్తారు. రీడ్‌ రిసిప్ట్స్‌కు అనుమతిస్తే అవతలివారికి మెసేజ్‌లను చదివినట్టు తెలుస్తుంది. కానీ బదులివ్వకపోతే తమను పట్టించుకోవటం లేదని, పక్కనపెడుతున్నారని అనుకోవచ్చు. ఇది లేనిపోని అపోహలకు తావిస్తుంది. అందుకే చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎంను వాడటానికి వెనకాడుతుంటారు. రీడ్‌ రిసిప్ట్స్‌ను టర్న్‌ఆఫ్‌ చేసుకునే సదుపాయం వస్తే ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరముండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు