
టెలిగ్రామ్ తాజాగా..
టెలిగ్రామ్ వినియోగదారులకు శుభవార్త. కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్తో ముందుకొచ్చింది. దీంతో రియాక్షన్లు, మెసేజ్ ట్రాన్స్లేషన్, థీమ్డ్ క్యూఆర్ కోడ్స్, హిడెన్ టెక్స్ట్ (స్పాయిలర్) ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలు వాడేవారు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి అప్డేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రియాక్షన్స్
దీంతో కొత్త మెసేజ్‌ను పంపించకుండానే ఎమోజీల ద్వారా ప్రతిస్పందించటానికి వీలవుతుంది. ప్రతీ రియాక్షన్ ప్రత్యేకమైన యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగత ఛాట్లలో రియాక్షన్స్ నేరుగా అందుబాటులో ఉంటాయి. అదే గ్రూప్ ఛాట్లలోనైతే అడ్మిన్లు అనుమతించాల్సి ఉంటుంది. అడ్మిన్లు తమ ఛానెల్ ఇన్ఫోపేజ్ ద్వారా ఎడిట్‌లోకి వెళ్లి రియాక్షన్సను నియంత్రించొచ్చు. కావాలంటే డిఫాల్ట్‌గా ఉన్న రియాక్షన్‌ను ఇష్టమైన ఎమోజీతో మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాడేవారు ఛాట్ సెటింగ్స్‌లోకి వెళ్లి, క్విక్ రియాక్షన్ విభాగం ద్వారా.. ఐఓఎస్ పరికరం వినియోగించేవారైతే స్టికర్స్ అండ్ ఎమోజీ ద్వారా క్విక్ రియాక్షన్‌ను మార్చుకోవచ్చు.
మెసేజ్ ట్రాన్స్లేషన్
ఇతర భాషల్లోని మెసేజ్‌లను ఇంగ్లిషులోకి అనువదించుకోవటానికిది ఉపయోగపడుతుంది. అన్ని ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్లలోనైతే ఐఓఎస్ 15, అంతకన్నా కొత్త వర్షన్లలో అందుబాటులో ఉంది. సెటింగ్స్‌లో లాంగ్వేజ్ ఆప్షన్ ద్వారా భాషను ఎంచుకొని, షో ట్రాన్స్‌లేట్ బటన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఛాట్‌లో మెసేజ్‌ను నొక్కి పడితే ఆటోమేటిక్ అనువాదం ఆప్షన్ కనిపిస్తుంది.
స్పాయిలర్స్
మెసేజ్‌లో ఏదైనా భాగం కనిపించకుండా చేయటానికిది తోడ్పడుతుంది. మేసేజ్ టైప్ చేశాక కనిపించకుండా చూడాలనుకునే భాగాన్ని సెలెక్ట్ చేసి స్పాయిలర్ ఆప్షన్‌ను ఎంచుకొని పంపించుకోవాలి. దీంతో అది అదృశ్యంగా ఉండిపోతుంది. అవతలివారు ఆ భాగం మీద ట్యాప్ చేస్తే గానీ కనిపించదు.
థీమ్డ్ క్యూఆర్ కోడ్స్
దీని ద్వారా టెలిగ్రామ్ యూజర్‌నేమ్ గలవారి క్యూఆర్ కోడ్‌ను సృష్టించుకోవచ్చు. దీన్ని ఇష్టమైనవారికి షేర్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్స్, ఛానెల్స్, బోట్స్ అన్నింటిలోనూ పనిచేస్తుంది. ఇందుకోసం ఆయా వ్యక్తుల లేదా యూజర్‌నేమ్ పక్కనుండే క్యూఆర్ కోడ్ గుర్తును నొక్కాలి. అప్పుడు కింద రంగులు, డిజైన్లు కనిపిస్తాయి. వాటిని ఎంచుకొని క్యూఆర్ కోడ్‌ను షేర్ చేసుకోవచ్చు. అవతలివారు దీన్ని స్కాన్ చేసి నేరుగా కాంటాక్ట్ కావొచ్చు.