వాట్సప్‌ డెస్క్‌టాప్‌ నుంచీ అకౌంట్‌ సమాచారం

వాట్సప్‌ వినియోగదారులు ఇకపై డెస్క్‌టాప్‌ బీటా వర్షన్‌ నుంచి కూడా తమ అకౌంట్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ పరికరాలపై ఇప్పటికే దీన్ని తీసుకునే వీలుండగా ఇప్పుడు డెస్క్‌టాప్‌ వర్షన్‌కూ విస్తరించనున్నారు.

Published : 25 May 2022 01:09 IST

వాట్సప్‌ వినియోగదారులు ఇకపై డెస్క్‌టాప్‌ బీటా వర్షన్‌ నుంచి కూడా తమ అకౌంట్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ పరికరాలపై ఇప్పటికే దీన్ని తీసుకునే వీలుండగా ఇప్పుడు డెస్క్‌టాప్‌ వర్షన్‌కూ విస్తరించనున్నారు.  వాట్సప్‌ డెస్క్‌టాప్‌ 2.2219.3 బీటా వర్షన్‌ నుంచి ఈ వెసులు బాటు మొదలవతుంది. బీటా 2.22.04.1 వర్షన్‌ విడుదల చేసినప్పుడే ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నట్టు వాట్సప్‌ ప్రకటించింది. ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. వాట్సప్‌ డెస్క్‌టాప్‌ వర్షన్‌ వాడేవారు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందో లేదో తేలికగా తనిఖీ చేసుకోవచ్చు. వాట్సప్‌ సెటింగ్స్‌ ఓపెన్‌ చేసి ‘రిక్వెస్ట్‌ అకౌంట్‌ ఇన్ఫో’ ఆప్షన్‌ ఉందో లేదో చూసుకోవాలి. ఇది కనిపించినట్టయితే దీని ద్వారా అకౌంట్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి రిక్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీంతో వాట్సప్‌ తమకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సేకరించిందనేది ఇట్టే తెలుసుకోవచ్చు. వాట్సప్‌ ఇటీవల మరో కొత్త ఫీచర్‌నూ పరీక్షిస్తున్నట్టు ప్రకటించింది. చడీచప్పుడు లేకుండా గ్రూప్‌లోంచి వెళ్లిపోవటానికిది వీలు కల్పిస్తుండటం విశేషం. కేవలం గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రమే మనం గ్రూప్‌ను వదిలేసినట్టు నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. మిగతా సభ్యులకు ఈ విషయం తెలియదు. ఇష్టంలేని గ్రూప్‌ల నుంచి బయటకు రావాలనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని