Messenger: మెసెంజర్‌లో కాల్స్‌ ట్యాబ్‌

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ మరింత కొత్తగా మారనుంది. త్వరలో దీనికి విడిగా ‘కాల్స్‌’ ట్యాబ్‌ తోడవనుంది. ఇది యాప్‌ తెరపై కింద కనిపించే ఛాట్స్‌, పీపుల్స్‌ ట్యాబ్‌ మధ్యలో ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే కాంటాక్ట్‌ జాబితా ఓపెన్‌ అవుతుంది. 

Updated : 08 Jun 2022 05:31 IST

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ మరింత కొత్తగా మారనుంది. త్వరలో దీనికి విడిగా ‘కాల్స్‌’ ట్యాబ్‌ తోడవనుంది. ఇది యాప్‌ తెరపై కింద కనిపించే ఛాట్స్‌, పీపుల్స్‌ ట్యాబ్‌ మధ్యలో ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే కాంటాక్ట్‌ జాబితా ఓపెన్‌ అవుతుంది.  ప్రస్తుతం మెసెంజర్‌తో స్నేహితులకో, కుటుంబ సభ్యులకో కాల్‌ చేయాలనుకుంటే త్రెడ్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. కొత్త కాల్స్‌ ట్యాబ్‌తో నేరుగా కాల్‌ చేయొచ్చు. కొవిడ్‌ విజృంభణ సమయంలో వీడియో కాల్‌ యాప్స్‌ బాగా ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఒకటి. దీన్ని వాడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో ఇంకాస్త సౌకర్యవంతంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మెసెంజర్‌ ద్వారా రోజుకు 30 కోట్ల ఆడియో, వీడియో కాల్స్‌ చేస్తున్నారు. కాల్స్‌ ట్యాబ్‌ జత చేయటం వల్ల ఇవి ఇంకాస్త పెరగొచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఐఓఎస్‌ పరికరాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కొద్దివారాల్లోనే ఆండ్రాయిడ్‌ వాడేవారికీ విస్తరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని