ట్విటర్‌లో పోల్‌ సెట్‌ చేస్తారా?

సామాజిక మాధ్యమాల్లో పోల్‌ ద్వారా అభిప్రాయాలను తెలుసుకోవటం తెలిసిందే. తమను అనుసరించేవారు ఆయా అంశాల గురించి ఏమనుకుంటున్నారో అనేది గ్రహించటానికివి తోడ్పడతాయి.

Published : 02 Nov 2022 00:16 IST

సామాజిక మాధ్యమాల్లో పోల్‌ ద్వారా అభిప్రాయాలను తెలుసుకోవటం తెలిసిందే. తమను అనుసరించేవారు ఆయా అంశాల గురించి ఏమనుకుంటున్నారో అనేది గ్రహించటానికివి తోడ్పడతాయి. సమాచార సేకరణకిది తేలికైన, సరైన మార్గం కూడా. మరి ట్విటర్‌లో పోల్స్‌ను ఎలా క్రియేట్‌ చేసుకోవాలో తెలుసా?

* ఆండ్రాయిడ్‌ పరికరంలో ట్విటర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* కింద కుడి మూలన కనిపించే ప్లస్‌ గుర్తు మీద నొక్కాలి.

* ట్వీట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* తెర అడుగున కనిపించే పోల్‌ బటన్‌ మీద తాకాలి.

* ప్రశ్న, ఐచ్ఛికాల బాక్సుల్లో వాటికి సంబంధించిన విషయాలను టైప్‌ చేయాలి.

* పోల్‌ గడువును ఎంచుకొని, సమయాన్ని సెట్‌ చేసుకోవాలి.

* అనంతరం పోల్‌ను ట్వీట్‌ చేయాలి. అంతే ఓట్లేయటానికి పోల్‌ సిద్ధమైపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని