ఎస్‌ఎంఎస్ మోసాలకు ట్రూకాలర్ కళ్లెం!
ఇటీవల ఎస్‌ఎంఎస్ మోసాలు పెరిగిపోయాయి. కరెంటు బిల్లు చెల్లింపు, బ్యాంకు సేవలు, ఉద్యోగ ఆహ్వానాలు, కేవైసీకి సంబంధించినవి, రుణాలు, లాటరీలు, దాన ధర్మాలు.. ఇలా ఏ రూపంలోనైనా నకిలీ మెసేజ్‌లు ఉండొచ్చు. ఇవి నిజమేనని నమ్మి క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
ఇటీవల ఎస్‌ఎంఎస్ మోసాలు పెరిగిపోయాయి. కరెంటు బిల్లు చెల్లింపు, బ్యాంకు సేవలు, ఉద్యోగ ఆహ్వానాలు, కేవైసీకి సంబంధించినవి, రుణాలు, లాటరీలు, దాన ధర్మాలు.. ఇలా ఏ రూపంలోనైనా నకిలీ మెసేజ్‌లు ఉండొచ్చు. ఇవి నిజమేనని నమ్మి క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే ట్రూకాలర్ తమ వినియోగదారుల కోసం కృత్రిమ మేధ ఆధారిత రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను ట్రూకాలర్స్ ప్రొప్రయిటరీ మెషిన్ లెర్నింగ్ నిఘాతో అనుసంధానం చేసి తనకు తానే మోసపూరిత మెసేజ్‌లను గుర్తిస్తుంది. వినియోగదారుల రిపోర్టులతో పనిలేకుండానే కొత్తరకం మోసాలనూ పసిగడుతుంది. నకిలీ మెసేజ్‌లను గుర్తించలేనివారికి, అవి విశ్వసనీయమైన సంస్థలకు చెందినవేనని పొరపాటున నమ్మేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగడనుంది. మనదేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నింటికీ ఈ ఫీచర్ ఉచితంగా అందుబాటులో ఉంది.
ఎలా పనిచేస్తుంది?
* మోసపూరిత మెసేజ్ అందినప్పుడు ట్రూకాలర్ యాప్ స్పష్టంగా ఎర్ర గుర్తుతో సూచిస్తుంది. ఎలాంటి చర్య తీసుకోవద్దని నోటిఫికేషన్‌తో హెచ్చరిస్తుంది. మనకు మనం దాన్ని తిరస్కరించేంతవరకు నోటిఫికేషన్ తెర మీద అలాగే ఉంటుంది. ఒకవేళ హెచ్చరికను చూడకుండా ఎస్‌ఎంఎస్‌ను ఓపెన్ చేస్తే ట్రూకాలర్ తనకు తానే లింకులను డిసేబుల్ చేస్తుంది. మెసేజ్‌ను పంపినవారు మంచివారేనని మనం మార్కు చేస్తేనే యాక్సెస్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఇది మరో రక్షణ ఏర్పాటు. యాప్ ఎలాంటి మెసేజ్‌లను అప్‌లోడ్ చేయదని ట్రూకాలర్ స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియంతా ఫోన్‌కే పరిమితమై ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!