బస్సు రైలు!

రోడ్డు మీదికి వస్తే బస్సు. పట్టాల మీదికి వెళ్తే రైలు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే జపాన్‌లో ఇటీవల ఆరంభమైన ఉభయచర వాహనం.. అంటే డబుల్‌-మోడ్‌ వాహనం గురించి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి వాహనం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది. ఇంజినీరింగ్‌, శాస్త్ర పరిజ్ఞానానికిదో మచ్చు తునక.

Updated : 11 May 2022 18:33 IST

రోడ్డు మీదికి వస్తే బస్సు. పట్టాల మీదికి వెళ్తే రైలు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే జపాన్‌లో ఇటీవల ఆరంభమైన ఉభయచర వాహనం.. అంటే డబుల్‌-మోడ్‌ వాహనం గురించి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి వాహనం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది. ఇంజినీరింగ్‌, శాస్త్ర పరిజ్ఞానానికిదో మచ్చు తునక. చూడటానికిది మినీ బస్సులా కనిపిస్తుంది. రోడ్డు మీద రబ్బరు టైర్లతోనే ప్రయాణిస్తుంది. అదే పట్టాల మీదికి రాగానే రైలు చక్రాలు కిందికి దిగుతాయి. ముందు ఉండే రబ్బరు టైర్లు పైకి లేస్తాయి. వెనక టైర్లు పట్టాలకు అటూఇటూగా ఉంటూ.. వాహనాన్ని ముందుకు నడిపిస్తాయి. ఇందులో 21 మంది ప్రయాణించొచ్చు. డీజిల్‌తో నడిచే ఇది రోడ్డు మీద గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. పట్టాల మీదైతే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చిన్న పట్టణాల్లో జనాభా తగ్గుతుండటం, స్థానిక రవాణా కంపెనీలకు ఆదాయం అంతగా లభించకపోవటం వల్ల ఈ కొత్తరకం వాహనాన్ని రూపొందించారు. ఇలా స్థానికులకు బస్సుగా ఉపయోగపడుతూనే రైలు ప్రయాణానికి వీలు కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని