లోహం + వాయువు = ఉప్పు!

కూరలో సోడియం క్లోరైడ్‌ వేశారా? అదేంటని అనుకుంటున్నారా? వాడుక భాషలో చెప్పాలంటే ఉప్పు. మనం వంటల్లో వాడుకునే ఉప్పు, సముద్రంలోని ఉప్పు చాలావరకు సోడియం క్లోరైడే.

Updated : 16 Mar 2022 16:12 IST

కూరలో సోడియం క్లోరైడ్‌ వేశారా? అదేంటని అనుకుంటున్నారా? వాడుక భాషలో చెప్పాలంటే ఉప్పు. మనం వంటల్లో వాడుకునే ఉప్పు, సముద్రంలోని ఉప్పు చాలావరకు సోడియం క్లోరైడే. చూడటానికిది స్ఫటికంలా ఉంటుంది గానీ నిజానికిది ఒక లోహం, ఒక విష వాయువు కలయిక! సోడియం ఒక మూలకం. శుద్ధరూపంలో ఇది మెరుస్తున్న లోహంలా ఉంటుంది. అయితే ఉప్పులోని సోడియం అణువులు భిన్నంగా ఉంటాయి. ఇవి సోడియం అయాన్లు. దీని ప్రతీ అణువులో ఒక ఎలక్ట్రాన్‌ తక్కువగా ఉంటుంది. మరి ఇదెక్కడికి పోతుంది? క్లోరిన్‌లోని అణువుకు జత కూడుతుంది. ఈ ఎలక్ట్రాన్‌ చేరుకోవటం వల్లనే క్లోరిన్‌ అయాన్‌గా మారి క్లోరైడ్‌ ఏర్పడుతుంది. సోడియం మాదిరిగానే క్లోరిన్‌ కూడా మూలకం స్థితిలో భిన్నంగానే  ఉంటుంది. ఇదో విష వాయువు. అయాన్‌గా మారటం వల్ల హాని చేయని విధంగా మారుతుంది. సోడియం, క్లోరిన్‌ మూలకాల అణువుల్లోని ఒక్కో జత ఎలక్ట్రాన్‌ అటూఇటూ మారిపోవటం వల్ల ఓ రుచికరమైన పదార్థం పుట్టుకురావటం విచిత్రమే కదా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని