Google: స్టోరేజ్‌ పెంచుతున్న గూగుల్‌.. వారి కోసం మాత్రమే!

గూగుల్ యూజర్లకు కొత్త అప్‌డేట్‌లను పరిచయం చేసింది. ఇందులో భాగంగా స్టోరేజ్‌ను పెంచడంతోపాటు, జీమెయిల్‌లో ప్యాకేజ్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇవేకాకుండా డ్రైవ్‌లో స్టోర్‌ చేసే ఫైల్స్‌కు ఇంటర్నెట్‌ మాల్‌వేర్‌ నుంచి భద్రత కల్పించనున్నట్లు తెలిపింది. 

Published : 03 Nov 2022 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ స్టోరేజ్‌ పరిమితిని పెంచుతున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రస్తుతం 15జీబీగా ఉన్న స్టోరేజ్‌ను 1టీబీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు బ్లాగ్‌లో పేర్కొంది. ఇది కేవలం గూగుల్ వర్క్‌స్పేస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు గూగుల్‌లో 15 జీబీకి మించి అదనపు స్టోరేజ్‌ కావాలంటే నెలవారీ అద్దె చెల్లించాల్సిందే. తాజా అప్‌డేట్‌లో 15 జీబీ నుంచి 1టీబీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గూగుల్‌ డ్రైవ్‌ను కూడా అప్‌డేట్‌ చేసింది. 

యూజర్లు ఇకపై గూగుల్ డ్రైవ్‌లో ఒకేసారి పీడీఎఫ్‌, క్యాడ్‌, ఇమేజ్‌ వంటి వందకు పైగా ఫైల్స్‌ను ఒకేసారి స్టోర్‌ చేసుకోవచ్చు. మాల్‌వేర్‌, స్పామ్‌, రాన్సమ్‌వేర్ వంటి ఇంటర్నెట్‌ మాల్‌వేర్‌ల నుంచి ఫైల్స్‌కు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. డ్రైవ్‌లో స్టోర్ చేసిన డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఫైల్స్‌గా సులువుగా మార్చుకునే ఆప్షన్‌ను కూడా పరిచయం చేసినట్లు గూగుల్ వెల్లడించింది. 

వీడియో కాలింగ్ యాప్‌ గూగుల్ మీట్‌ యూజర్ల కోసం జూమ్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా మీట్‌ వీడియో కాలింగ్‌ జూమ్‌  రూమ్‌, మీట్‌ డివైజ్‌లలో కూడా పనిచేసేలా కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేయనున్నట్లు గూగుల్‌ బ్లాగ్‌లో పేర్కొంది. దీనివల్ల వేర్వేరు ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి వీడియో కాలింగ్‌లో పాల్గొనే వారితో ఇతరులు సులువుగా కనెక్ట్‌ కావచ్చని కంపెనీ చెబుతోంది. 

ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వారికోసం  జీమెయిల్‌లో ప్యాకేజ్‌ డెలివరీ  ట్రాకింగ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీనివల్ల ప్యాకేజ్‌ స్టేటస్‌ను యూజర్లు సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా ఈ ఫీచర్‌ అమెరికన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. తర్వాత అన్ని రీజియన్లలోని యూజర్లకు పరిచయం చేస్తారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని