Nothing Phone (1): నథింగ్ ఫోన్‌ ఎంత, ఫీచర్లేంటి, విడుదల ఎప్పుడు.. ఈ వివరాలు ఐదు పాయింట్లలో!

యూజర్లకు విభిన్నమైన ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో నథింగ్ (Nothing) కంపెనీ జూన్‌ 12 తేదీన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ గురించిన ఐదు ఆసక్తికర అంశాలు మీ కోసం..

Updated : 10 Jun 2022 19:12 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్లకు విభిన్నమైన ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో నథింగ్ (Nothing) కంపెనీ గతేడాది ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో జూన్‌ 12 తేదీన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల (Nothing Smartphone) చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్‌ గురించి ఐదు ఆసక్తికర అంశాలు మీ కోసం..

  1. నథింగ్ ఫోన్‌ వన్‌ (Nothing Phone (1)) పేరుతో ఐఫోన్‌కు పోటీగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు కార్ల్‌ పెయి తెలిపారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ప్రకటనలు ఉండవని నథింగ్ సంస్థ తెలిపింది.  
  2. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి.
  3. మొత్తం నాలుగు కెమెరాలున్నాయట. వెనుక మూడు, ముందు ఒకటి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చినట్లు సమాచారం.
  4. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 45 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తోపాటు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.  
  5. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లో తీసురానున్నట్లు సమాచారం. దీని ధర ₹ 35 వేల నుంచి ₹ 40 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని