Infinix: ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ మొబైల్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లివే..!

మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్‌ మొబైల్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్ఫినిక్స్‌ హాట్‌ 12 ప్లే’ పేరుతో దీనిని విడుదల చేసింది.

Published : 31 May 2022 02:16 IST

దిల్లీ: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి బడ్జెట్‌ శ్రేణిలో కొత్త మొబైల్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్ఫినిక్స్‌ హాట్‌ 12 ప్లే’ పేరుతో దీనిని విడుదల చేసింది. 4GB ర్యామ్‌/64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఒకే ఒక్క వేరియంట్‌లో ఈ మొబైల్‌ లభిస్తుంది. డేలైట్‌ గ్రీన్‌, రేసింగ్‌ బ్లాక్‌, హారిజన్‌ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్టు ద్వారా సోమవారం (మే 30) మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ‘ఇన్ఫినిక్స్‌ హాట్‌ 12 ప్లే’ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది.

ఫీచర్లు ఇవే..

‘ఇన్ఫినిక్స్‌ హాట్‌ 12 ప్లే’ మొబైల్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.82 అంగుళాల డిస్‌ప్లేతో పాండా ఎంఎన్‌228 గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఆక్టా-కోర్‌ యూనిసాక్‌ టీ610 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 11పై రన్‌ అవుతుంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఇస్తున్నారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 3 జీబీ వరకు, ఎస్‌డీ కార్డుతో మొబైల్‌ స్టోరేజీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ మొబైల్‌లో వెనుకభాగంలో 13 ఎంపీ ప్రధాన కెమెరా, డెప్త్‌ సెన్సార్‌ కెమెరాలున్నాయి. ముందువైపు 8ఎంపీ పంచ్‌ హోల్‌ కెమెరా ఉంది. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. 6,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్‌ 10 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్‌, 120 గంటల పాటు మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని