iPhone: ఐఫోన్ 12 సిరీస్‌పై బంపరాఫర్‌..!

ఐఫోన్ 12 సిరీస్‌పై యాపిల్ కంపెనీ భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా..

Published : 09 Jan 2022 18:43 IST

దిగ్గజ కంపెనీ యాపిల్ మొబైల్స్‌ (iPhone) వాడాలని ఉన్నా.. వాటి ధరను చూసి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే యాపిల్‌ కంపెనీ ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. తగ్గింపులో ఐఫోన్‌ను పట్టేయడానికి కాచుకూర్చొని ఉంటారు. అలాంటి వారికి సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఇదో బంపరాఫర్!

ఐఫోన్ 12 సిరీస్‌పై యాపిల్ భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 మినీ కొనుగోలు చేస్తే ప్రస్తుతం భారీ తగ్గింపును పొందవచ్చు. డ్యూయల్‌ సిమ్‌ (నానో+ఇ-సిమ్‌) వచ్చే ఈ రెండు మోడల్స్‌ను యాపిల్‌ ఏ14 బయోనిక్‌ చిప్‌, స్పోర్ట్‌ సూపర్‌ రెటినా XDR OLED డిస్‌ప్లేతో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 6.1, 5.4 అంగుళాల స్క్రీన్‌, 12 ఎంపీ డ్యూయల్‌ రియల్‌, వైడ్‌ యాంగిల్‌, అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలతో ఈ మోడల్స్‌ను తొలుత ఐఓఎస్‌ 14తో యాపిల్‌ లాంచ్‌ చేసింది. ఆపై ఐఓఎస్‌ 15కి అప్‌డేట్ చేసింది.

ఆఫర్లు ఇవే..

ఐఫోన్‌ 12- 64 జీబీ వేరియంట్‌ అసలు ధర ₹65,900 ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో దీని సవరించిన ధర ₹53,999, అమెజాన్‌లో ₹63,900గా ఉంది. అలాగే ఐఫోన్‌ 12- 128 జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ₹64,999 ఉండగా, అమెజాన్‌లో ₹63,900గా ఉంది. మరోవైపు ఐఫోన్‌ 12 మినీ 64 జీబీ అసలు ధర ₹59,900 ఉండగా, ఫ్లిప్‌కార్డులో ₹40,900, అమెజాన్‌లో ₹53,900గా అందుబాటులో ఉంది. అయితే, మోడల్స్‌లో రంగులను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. కాగా, ఐఫోన్‌ 12 సిరిస్‌పై యాపిల్‌ గతంలోనూ భారీ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని