Telegram: టెలిగ్రాంలో మెసేజ్ ట్రాన్స్‌లేషన్‌.. ఎలా చేయాలంటే?

టెలిగ్రాం ఫీచర్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యూజర్స్ తమకు వచ్చే మెసేజ్‌లను తమకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌  చేసుకొని చదవచ్చు. 

Published : 06 Feb 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర మెసేజింగ్ యాప్‌లకు ధీటుగా టెలిగ్రాం సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్లకు ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం యాప్‌లో ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్స్‌ టెలిగ్రాం చాట్‌ లేదా గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లను తమకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో యూజర్స్ మరింత సులువుగా టెలిగ్రాంను యాక్సెస్ చేయగలుగుతారని సంస్థ తెలిపింది. మరి ఈ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో టెలిగ్రాంలో మెసేజ్‌లు ఎలా చదవాలో తెలుసుకుందాం.

  • ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు ముందుగా టెలిగ్రాం యాప్‌లో ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో లాంగ్వేజ్ బటన్‌పై క్లిక్‌ చేస్తే షో ట్రాన్స్‌లేషన్‌ బటన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి.
  • తర్వాత మీకు 18 అంతర్జాతీయ భాషలతో కూడిన జాబితా కనిపిస్తుంది. వాటిలో మీరు మెసేజ్ ఏ భాషలో ట్రాన్స్‌లేషన్ కావాలనుకుంటున్నారో సదరు భాషను ఎంచుకోవాలి. ఒకవేళ  మీకు తెలియని భాషలో మెసేజ్ వచ్చినా.. దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తుంది. అయితే ఈ జాబితాలో భారతీయ భాషలు లేకపోవడం గమనార్హం.
  • షో ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ కింద డు నాట్‌ ట్రాన్స్‌లేట్‌ అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే భాషల జాబితా కనిపిస్తుంది. అందులో ట్రాన్స్‌లేషన్‌ అవసరంలేని భాషను ఎంచుకుంటే, సదరు భాషలోకి మెసేజ్‌లు ట్రాన్‌లేట్ కావు.
  • ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ ఎనేబుల్ చేశాక.. చాట్ లేదా గ్రూప్‌లోకి వెళ్లి ఏదైనా మెసేజ్‌పై క్లిక్ చేస్తే పాప్‌-అప్ విండోలో ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే మీరు ఎంచుకున్న భాషలోకి మెసేజ్ ట్రాన్స్‌లేట్ అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని