Google Chrome: క్రోమ్‌ యూజర్లు.. ఈ ఎక్స్‌టెన్షన్లు వెంటనే డిలీట్ చేయండి!

గూగుల్ క్రోమ్‌లో ఐదు ఎక్స్‌టెన్షన్స్ యూజర్ డేటా లక్ష్యంగా పనిచేస్తున్నాయని యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మెకాఫే సంస్థ తెలిపింది... 

Updated : 01 Sep 2022 20:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్‌ బ్రౌజింగ్‌లో అదనపు ఫీచర్ల కోసం చాలా మంది బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్స్ ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా నకిలీ ఎక్స్‌టెన్షన్లు ఉంటాయి. అలాంటి వాటిని బ్రౌజింగ్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు తొలగిస్తుంటాయి. తాజాగా గూగుల్ క్రోమ్‌లో ఐదు ఎక్స్‌టెన్షన్స్ యూజర్ డేటా లక్ష్యంగా పనిచేస్తున్నాయని యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మెకాఫే సంస్థ తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో ఒక రిపోర్ట్‌ను ప్రచురించింది. గూగుల్ క్రోమ్‌లోని నెట్‌ఫ్లిక్స్‌ పార్టీ (Netflix Party), నెట్‌ఫ్లిక్స్‌ 2 (Netflix Party 2), ఫ్లిప్‌షాపే (Flipshope), ఫుల్‌ పేజ్‌ స్క్రీన్‌షాట్‌ క్యాప్చర్‌ (Full Page Screenshot Capture), ఆటోబై ఫ్లాష్‌ సేల్స్‌ (AutoBuy Flash Sales) అనే ఐదు ఎక్స్‌టెన్షన్లు యూజర్‌ డేటాను సేకరించి డెవలపర్స్‌కు పంపుతున్నాయని తెలిపింది. ఇప్పటి వరకు వీటిని సుమారు 14 లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. యూజర్లు వెంటనే సదరు ఎక్స్‌టెన్షన్లు బ్రౌజర్‌ నుంచి తొలగించుకోవాలని సూచించింది. 

ఈ ఎక్స్‌టెన్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు బ్రౌజర్‌లో వెబ్‌ పేజీలు ఓపెన్‌ చేసిన ప్రతిసారీ వెబ్‌సైట్‌ కూపన్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాల ద్వారా ఆకర్షించి, యూజర్‌ ఏం చేస్తున్నారనే సమాచారంతోపాటు యూజర్‌ డేటాను ఎక్స్‌టెన్షన్‌ డెవలపర్స్‌కు చేరవేస్తున్నాయని మెకాఫే తన బ్లాగ్‌లో పేర్కొంది. దీనివల్ల యూజర్‌ బ్రౌజింగ్‌ సమాచారంతోపాటు, వ్యక్తిగత డేటాకు కూడా డెవలపర్స్‌కు చేరుతుందని తెలిపింది. యూజర్లు ఎక్స్‌టెన్షన్‌ యాడ్ చేసిన 15 రోజుల తర్వాత నుంచి వారి బ్రౌజింగ్‌ను ట్రాక్‌ చేస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే గూగుల్ వీటిని తొలగించింది. యూజర్లు కూడా తమ బ్రౌజర్‌ నుంచి వీటిని డిలీట్ చేయమని మెకాఫే కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు