Apple watch: యాపిల్‌ వాచ్‌ని ఎంత మంది వాడుతున్నారో తెలుసా?

ముఖ్యంగా అమెరికాలో వీటిని వాడేవారి సంఖ్య ఎక్కువ ఉందట. ఇక మార్కెట్లో యాపిల్‌ షేర్‌ విషయానికొస్తే.. 28 శాతం ఉండగా ఇతర స్మార్ట్‌ వాచ్‌ కంపెనీలు.. హవాయీ, శాంసంగ్‌, గార్మిన్‌ల కంటే ఎక్కువ షేర్‌తో ముందుకు దూసుకెళ్తొంది

Updated : 13 Aug 2022 12:22 IST

దిల్లీ: యాపిల్‌ వాచ్‌.. మార్కెట్‌లో దీనికుండే క్రేజ్‌ వేరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లదారుల సంఖ్య 10కోట్లపైగా ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. 2021 రెండో త్రైమాసికం ప్రకారం... ఐ వాచ్‌ షిప్పింగ్‌ విషయంలో ముందంజలో ఉంది. గతేడాది ఇదే సమయంలో మార్కెట్‌లో యాపిల్‌ వాచ్‌ విక్రయాలు కాస్త నెమ్మదించాయి. అందుకు కారణమేమిటంటే.. తక్కువ ధరలకే మంచి ఫీచర్లతో స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి రావడం. దీంతో రెండింటికీ మధ్య నెలకొన్న పోటీల్లో యాపిల్‌ అమ్మకాల జోరు తగ్గింది. యాపిల్‌ వాచ్‌లో ఉండే హెల్త్‌ ఫీచర్స్.. ముఖ్యంగా కొవిడ్‌-19 లక్షణాల గుర్తింపు పాటు ఆకట్టుకునే డిజైన్లు, ఆధునిక ఫీచర్లు కారణంగా మార్కెట్‌ వాటి విలువ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో వీటిని వాడేవారి సంఖ్య ఎక్కువ ఉందట. ఇక మార్కెట్లో యాపిల్‌ షేర్‌ విషయానికొస్తే.. 28 శాతం ఉండగా ఇతర స్మార్ట్‌ వాచ్‌ కంపెనీలు.. హవాయీ, శాంసంగ్‌, గార్మిన్‌ల కంటే ఎక్కువ షేర్‌తో ముందుకు దూసుకెళ్తోంది. కేవలం యాపిల్‌ వాచ్‌ మాత్రమే కాకుండా చైనీస్‌ బ్రాండ్‌ నుంచి విడుదలైన రెడ్‌మీ, రియల్‌మీ, ఒప్పో.. భారత్‌ బ్రాండ్స్‌ బోట్‌, నాయిస్‌ అమ్మకాలు సైతం పెరిగినట్లు మార్కెట్‌ అధ్యయనాల్లో తేలింది.

2021 రెండో త్రైమాసికంలో ఎక్కువగా కొనుగోలు చేసిన యాపిల్‌ వాచ్‌, వాటి సిరీస్‌లు.  భారత్‌లో వాటి ధరలు

* యాపిల్‌  వాచ్‌ సిరీస్‌ 6 సుమారు రూ.40,000 ప్రారంభ ధర

*  యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ  రూ. 29,900 ప్రారంభ ధర

* యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3  రూ.20,900 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని