Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్‌ కొనాలా..? ₹5 వేల లోపు ధరలో ఉన్న వీటిపై ఓ లుక్కేయండి!

Raksha Bandhan 2022: రూ. ఐదు వేలలోపు ధరలో గిఫ్ట్‌ల వివరాలు మీ కోసం

Published : 11 Aug 2022 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఖీ పండగ వచ్చేస్తోంది. శుక్రవారమే ఈ సోదరసోదరీమణుల పండగ. సోదరి రాఖీ కట్టాక గిఫ్ట్‌గా ఏదైనా గ్యాడ్జెట్‌ని ఇద్దామనుకొంటున్నారా? అయితే ఈ గ్యాడ్జెట్‌లపై ఓ లుక్కేయండి. రోజూ ఉపయోగపడే ఈ గ్యాడ్జెట్‌లు రూ.5 వేల లోపు ధరలోనే అందుబాటులో ఉంటాయి.


గిఫ్ట్‌గా ‘పవర్‌’

మీ సోదరి వృత్తిగత/వ్యక్తిగత అవసరాల మేరకు ఎక్కువగా మొబైల్‌ వాడుతుంటారా? అయితే ఛార్జింగ్‌ సమస్య లేకుండా పవర్‌ బ్యాంక్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. 30000 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న ఎంఐ పవర్‌ బ్యాంకు ₹2,999కే అందుబాటులో ఉంది. ఒకవేళ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కావాలంటే ₹2,499 ధరలో వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంకు దొరుకుతుంది. అయితే దీని సామర్థ్యం 10,000 ఎంఏహెచ్‌.


నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో...

పాటలు వినడం, ఆడియో బుక్స్‌ వినడం లాంటి హాబీలు మీ సోదరికి ఉన్నాయా? అయితే ఎయిర్‌ పాడ్స్‌ చక్కటి గిఫ్ట్‌ అవుతుంది. రూ.3 వేలు ధరలో రియల్‌మీ డిజో నుంచి ఎయిర్‌పాడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. డిజో బడ్స్‌ జెడ్‌ (Buds Z Pro) పేరుతో రియల్‌మీ తీసుకొచ్చింది. దీని ధర రూ.2,999. ఇందులో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సౌకర్యం ఉంది. దీంతో డిస్ట్రబెన్స్‌ లేకుండా పాటలు/మాటలు వినొచ్చు.  ఒకవేళ రూ.2 వేల ధరలో అయితే ఇదే కంపెనీ నుంచి బడ్స్‌ జెడ్‌ ఉంది.


స్మార్ట్‌ సిస్టర్‌ కోసం...

మీ సోదరి ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనుకోండి.. స్మార్ట్‌ వాచ్‌ను మించిన గిఫ్ట్‌ మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో ఫైర్‌ బోల్ట్‌ నుంచి విజినరీ (Fire boltt visionary) పేరుతో ఓ స్మార్ట్‌ వాచ్‌ వచ్చింది. ఇందులో బ్లూ టూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. దీని ధర రూ.3,999. ఒకవేళ రూ.2వేలు ఆ పై ధరలో చూస్తుంటే బోట్‌ వేవ్‌ ప్రో (boAt Wave Pro) బాగుంటుంది. దీని ధర రూ. 2,499. అయితే ఇందులో కాలింగ్‌ సదుపాయం లేదు. 


పాటల డబ్బా ఇస్తారా

స్పీకర్‌లో ఫుల్‌ వాల్యూమ్‌లో పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేయడం, వాయిస్‌ అసిస్టెంట్‌తో పనులు చేయించుకోవడం లాంటివి సరదాలు మీ సోదరికి  ఉన్నాయా? అయితే ఓ బ్లూటూత్‌ స్పీకర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. అమెజాన్‌ నుంచి ఎకో డాట్‌ (Echo Dot) మూడో జనరేషన్‌ అలెక్సా వచ్చింది. దీని ధర ₹2,249. ఒకవేళ వాయిస్‌ అసిస్టెంట్‌ సౌకర్యం వద్దు అనుకుంటే జేబీఎల్‌లో గో 3 (JBL G0 3) కూడా ఉంది.  దీని ధర రూ.3,499. 


డేటా దాచుకోవడానికి..

మొబైల్‌ స్టోరేజీని ఫొటోలతో నింపే సోదరా.. మీ సిస్టర్‌. అయితే అదనపు మెమొరీ అవసరం చాలా ఎక్కువే ఉంటుంది. దీనికోసం సీగేట్‌ ఎక్స్‌పాన్సన్‌ (Seagate Expansion), వెస్ట్రన్‌ డిజిటల్‌ (Western Digital)లో ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌లు అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ.4 వేలు లోపే ఉంటుంది. అలా కాకుండా క్లౌడ్‌ స్టోరేజీ స్పేస్‌ కొని డిజిటల్‌ గిఫ్ట్‌ ఇద్దాం అనుకుంటే గూగుల్‌ 100 జీబీ స్టోరేజీని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీని ధర ఏడాదికి రూ. 1300. ఒకవేళ 200జీబీ ఇవ్వాలంటే రూ.2100.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని