Instagram: యూజర్ల ‘బర్త్ డే’లపై ఇన్‌స్టా కన్ను.. ఎందుకోసమంటే?
ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల పుట్టిన రోజును సేకరించే పనిలో పడింది. ఎప్పుడూ లేనిది ఇదేంటీ కొత్తగా?
ఇంటర్నెట్ డెస్క్: ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల పుట్టిన రోజును సేకరించే పనిలో పడింది. ఎప్పుడూ లేనిది ఇదేంటీ కొత్తగా? అని కొంత మంది యూజర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ సమాచారం దేనికోసమంటూ నెట్టింట్లో చర్చిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలువురు యూజర్లు యాప్‌లో ‘రిపోర్ట్’ ద్వారా ప్రశ్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి అసలు కారణం ఏమై ఉంటుంది?
ఎందుకోసమంటే?
ఇన్స్టాగ్రామ్ ఇంతవరకు యూజర్లను తమ పుట్టిన రోజును నమోదు చేయాలని అడగలేదు. వయసుతో సంబంధం లేకుండానే ఖాతా తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, కొద్దికాలం నుంచి ఇన్స్టాగ్రామ్ ఏజ్ వేరిఫికేషన్ ప్రాసెస్‌ను తప్పనిసరి చేయాలని చూస్తోంది. తాజాగా దీనిపై సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 ఏళ్లలోపు ఉన్న మైనర్ యూజర్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసమే పుట్టినరోజు సమాచారాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేయాలని యూజర్లను కోరుతోంది. ఇన్స్టాగ్రామ్ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా వరకు ఫేక్ ఐడీలకు చెక్ పడే అవకాశం ఉంది.
‘‘మీరు ఎప్పటిలాగే ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించాలంటే ముందుగా మీ పుట్టినరోజు తేదీలను నమోదు చేసుకోండి. ఇన్‌స్టా కమ్యూనిటీ భద్రతకు ఇది సాయపడుతుందని భావిస్తున్నాం. మీ వివరాలు పబ్లిక్ ప్రొపైల్‌లో షేర్ అవ్వవు’’ అని బర్త్ డే పేజీలో ఇన్స్టాగ్రామ్ పేర్కొంది.
కొంతమంది తప్పుడు తేదీలను ఎంటర్ చేసి ఇన్‌స్టాను వాడొచ్చు కదా అనే సందేహం కలగవచ్చు. అయితే, ఫేక్ బర్త్‌డేలను గుర్తించడంపైనా ఇన్‌స్టా ప్రత్యేకంగా దృష్టి సారించింది. మనం నమోదు చేసిన తేదీలను ఫేస్బుక్ డేటా నుంచి క్రాస్ చెక్ చేయనుంది. ఒకవేళ తప్పుడు తేదీలను ఎంటర్ చేసినా ఇన్‌స్టా యాప్ సైన్ అప్ అవ్వదు. కాబట్టి ఫేసుబుక్‌లో ఎంటర్ చేసిన పుట్టిన రోజు తేదీనే ఇన్‌స్టాలో నమోదు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీమెయిల్ జిందగీ
స్మార్ట్ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. వ్యక్తిగత పనులకే కాదు.. ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరయ్యాయి. -
ఆడియో ఎమోజీ!
ఎమోజీలనగానే బుల్లి బుల్లి బొమ్మలే గుర్తుకొస్తాయి. మరి ఆడియో రూపంలో ఉంటే? గూగుల్ ఫోన్ వీటిని కొత్తగా పరిచయం చేసింది. -
యూట్యూబ్ స్క్రీన్‌షాట్ ఇలా..
యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాం. ఒక సన్నివేశం బాగా నచ్చొచ్చు. లెక్కల వంటి పాఠాలు చూస్తున్నప్పుడు వాటిని వెంటనే నోట్ చేసుకోలేకపోవచ్చు. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్‌కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!