వర్సిటీల్లో నియామకాల ఉమ్మడి బోర్డు రద్దు చేయాలి

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా శుక్రవారం ఆందోళనలు

Published : 25 Jun 2022 03:08 IST

విద్యార్థి, ఉద్యోగ సంఘాల డిమాండ్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా శుక్రవారం ఆందోళనలు నిర్వహించాయి. ప్రత్యేక నియామక బోర్డును రద్దు చేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి బోర్డు ఏర్పాటుతో వర్సిటీలపై ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓయూ పరిపాలన భవనం ఎదుట, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు జ్ఞానేశ్వర్‌, సూర్యచందర్‌, ఆంజనేయులు, రవినాయక్‌ తదితరులు మాట్లాడుతూ.. ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి బోర్డును రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఉమ్మడి నియామక బోర్డును రద్దు చేయాలని తెలంగాణ డాక్టరేట్స్‌ అసోసియేషన్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఐఎఫ్‌టీయూ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని