విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

విద్యార్థులకు విద్య ఎంత ముఖ్యమో, క్రమశిక్షణ అంతే ముఖ్యమని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఇంటర్‌లో గండిపేట ఎన్టీఆర్‌ కుటీరంలోని ఎన్టీఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు

Published : 30 Jun 2022 06:24 IST

ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: విద్యార్థులకు విద్య ఎంత ముఖ్యమో, క్రమశిక్షణ అంతే ముఖ్యమని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఇంటర్‌లో గండిపేట ఎన్టీఆర్‌ కుటీరంలోని ఎన్టీఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంపై బుధవారం ఆమె ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఇ.నిత్యాగౌడ్‌ సహా 24 మంది, బైపీసీలో ఎనిమిది మంది, ఎంఈసీలో ఏడుగురు, సీఈసీలో ఆరుగురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కళాశాల ప్రాంగణంలో డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌ ప్రసాద్‌, సీఈవో రాజేంద్రకుమార్‌, డీన్‌ డా.ఎంవీ రామారావు, ప్రిన్సిపల్‌ ఎస్‌జే రెడ్డి తదితరులు సదరు విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని