ముంచెత్తిన వాన

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకబిగిన కురిసిన కుండపోత వానకు జిల్లాకేంద్రంలోని పెద్దచెరువు సమీప బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌలి కాలనీలు నీట మునిగాయి.వీధుల్లో

Published : 30 Sep 2022 04:09 IST

మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో కుండపోత

న్యూస్‌టుడే యంత్రాంగం: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకబిగిన కురిసిన కుండపోత వానకు జిల్లాకేంద్రంలోని పెద్దచెరువు సమీప బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌలి కాలనీలు నీట మునిగాయి.వీధుల్లో నిలిపిన పలు కార్లు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ప్రవాహం తగ్గాక వాటిని యజమానులు వివిధ యంత్రాల సాయంతో తెచ్చుకున్నారు. బీకేరెడ్డి కాలనీలో ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియలకు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని ఎర్రసత్యం కూడలి సమీపంలోని కృష్ణా థియేటర్‌లోకి వర్షపు నీరు చేరింది.

* ఖమ్మం జిల్లాలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఖమ్మం నగరంలో తెల్లవారుజామున 4 గంటల వరకు వాన దంచికొట్టింది. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

పిడుగుపాటుకు నలుగురి మృతి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వెల్మజాలకు చెందిన ఉడుగుల సందీప్‌కుమార్‌(23),  జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దుబ్బతండాకు చెందిన రైతు లకావత్‌ సురేందర్‌ (32)లు పిడుగుపాటుకు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొలుకులపల్లిలోని పొలంలో నల్గొండ జిల్లా మదనాపూర్‌కి చెందిన పడాల అక్రం (40), వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్‌కు చెందిన రైతు వడ్ల వీరేశం(48)లు పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు.

నేడూ భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం వెల్లడించింది. గురువారం అత్యధికంగా జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో 11.9 సెం.మీ. వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని