ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ

పై చిత్రంలో రిబ్బన్‌ కత్తిరిస్తున్న మహిళ మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలాధ్యక్షురాలు పద్మావతి. రెండో చిత్రంలో మిరపకాయల ఏరివేత పని చేస్తున్నది కూడా ఆమే.

Published : 02 Apr 2023 07:50 IST

కురవి ఎంపీపీ జీవన సమరం

పై చిత్రంలో రిబ్బన్‌ కత్తిరిస్తున్న మహిళ మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలాధ్యక్షురాలు పద్మావతి. రెండో చిత్రంలో మిరపకాయల ఏరివేత పని చేస్తున్నది కూడా ఆమే. ప్రవృత్తిరీత్యా రాజకీయాల్లో ఉన్నా.. ఆమె బతుకుతెరువు కోసం కూలి పనులకు వెళ్లక తప్పనిస్థితి. శనివారం ఉదయం ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ఆమె కురవిలో ఐకేపీ మండల సమాఖ్య కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. తర్వాత మధ్యాహ్నం ఆమె ఓ రైతు పొలంలోని మిర్చి తోటలో కూలిపని చేయడానికి వెళ్లారు. ఆమె భర్త గుగులోతు రవి భారాసలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తుంటారు.   

 కురవి, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని