Adilabad: చీకట్లలో ‘వెలిగిన’ ఆలోచన

ఈ చిత్రంలోని యువకుడి వేషధారణ చూస్తే ఎవరైనా బొగ్గు గని కార్మికుడు అనుకుంటారు. నిజానికి అతను పంట చేల కాపలాదారుడు.

Published : 08 Jan 2024 07:50 IST

ఈ చిత్రంలోని యువకుడి వేషధారణ చూస్తే ఎవరైనా బొగ్గు గని కార్మికుడు అనుకుంటారు. నిజానికి అతను పంట చేల కాపలాదారుడు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం లోహారి గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు పండర బొజ్జు. రాత్రి వేళల్లో వెళ్తున్నప్పుడు దారిలో క్రిమికీటకాలు, పాములు, అడవి పందులతో ప్రమాదాలు ఎదుర్కొనేవాడు. పొలంలో జంతువుల అలికిడి వినిపిస్తున్నా.. వెళ్లి చూద్దామంటే చేతిలో ఉన్న టార్చిలైటు వెలుగు సరిపోయేది కాదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సింగరేణి కార్మికులు గనుల్లో తలకు ధరించే బ్యాటరీ లైటు తరహాలో తయారు చేసుకోవాలని ఆలోచించాడు. ఎలక్ట్రికల్‌ దుకాణం వారిని అడిగి అవసరమైన వస్తువులు కొనుగోలు చేశాడు. ఎలా తయారు చేయాలో వారి ద్వారానే కొంత అవగాహన తెచ్చుకున్నాడు. తరువాత యూట్యూబ్‌లోనూ చూసి ఎక్కువ వెలుగు వచ్చే బ్యాటరీ లైటును రూపొందించాడు. పగటి పూట ఛార్జింగ్‌ చేస్తే రాత్రంగా పని చేస్తోందని చెబుతున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని