Medaram: మేడారం భక్తులకు ఉపశమనం

మేడారం తరలివస్తున్న భక్తులకు ఉపశమనం లభించింది. టోల్‌, పర్యావరణ, పార్కింగ్‌ రుసుముల భారంపై గురువారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘మేడారం దారిలో బాదుడే బాదుడు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది.

Updated : 02 Feb 2024 07:15 IST

నేటి నుంచి 29 వరకు పర్యావరణ రుసుం నిలిపివేత
‘ఈనాడు’ కథనానికి స్పందించిన మంత్రి కొండా సురేఖ

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: మేడారం తరలివస్తున్న భక్తులకు ఉపశమనం లభించింది. టోల్‌, పర్యావరణ, పార్కింగ్‌ రుసుముల భారంపై గురువారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘మేడారం దారిలో బాదుడే బాదుడు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం నుంచి వచ్చే వాహనాలకు పర్యావరణ రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుం (ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు) వసూలును నిలిపివేస్తున్నట్లు చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ములుగు జిల్లా అటవీశాఖ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని