సీతమ్మకు కల్యాణం చీర

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతమ్మవారికి కల్యాణం చీరను అందించనున్నారు.

Published : 16 Apr 2024 03:34 IST

సిరిసిల్ల, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతమ్మవారికి కల్యాణం చీరను అందించనున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని ఏటా చీరను రూపొందించి కానుకగా పంపిస్తారు. ఈసారి సీతారాముల ప్రతి రూపాలు, అంచుల్లో చీర మొత్తం శంఖుచక్ర నామాలు, జైశ్రీరామ్‌ అని వచ్చే విధంగా మగ్గంపై నేశారు. అయిదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పున్న దీని బరువు 800 గ్రాములు. రూ.60,000 ఖర్చు అయింది. రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టు దారాలను తయారీలో ఉపయోగించారు. చీరకొంగులో సీతారాముల కల్యాణ బొమ్మ ఆకట్టుకుంటోంది. ఈనెల 17న ఆలయానికి అందించనున్నట్లు హరిప్రసాద్‌ తెలిపారు.


మండపేట నుంచి బొండాలు

మండపేట, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తుడు కె.వి.ఎ.రామారెడ్డి కొబ్బరిబొండాలు సిద్ధం చేస్తున్నారు. మండపేటకు చెందిన ఈయన 24 ఏళ్లుగా భద్రాచలం కల్యాణానికి అలంకరించిన బొండాలను అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని