USA: కిమ్‌ కారు వారెంటీ పొడిగిస్తారేమో..: పుతిన్‌ను వెక్కిరించిన అమెరికా

కిమ్‌కు పుతిన్‌ కారును బహుమతిగా ఇవ్వడాన్ని అమెరికా హేళన చేసింది. అసలు రష్యాలో విలాసవంతమైన కార్లే ఉండవన్నట్లు మాట్లాడింది. 

Published : 22 Feb 2024 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్కో తయారీ ఉత్పత్తుల నాణ్యతను వెక్కిరించేందుకు లభించిన ఏ అవకాశాన్ని వాషింగ్టన్‌ తేలిగ్గా వదులుకోదు. తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌(kim jong un)కు రష్యా అధినేత పుతిన్‌ ఓ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చారు. ఇది పూర్తిగా రష్యాలోనే తయారైంది. ఈ చర్యను ఉత్తర కొరియా మీడియా ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి చిహ్నంగా పేర్కొంది. 

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ఈ పరిణామంపై నేడు స్పందించారు. ‘‘ఒక్క మాట నిజాయితీగా చెప్పనా.. రష్యాలో విలాసవంతమైన కారు అనేది ఉంటుందని నాకు తెలియదు. కిమ్‌కు ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని ఇస్తారని ఆశిస్తున్నా. రష్యా నుంచి బహుమతి వెళ్లిన మాట వాస్తవమే అయితే.. అది ఐరాస ఆంక్షలను ఉల్లంఘించినట్లే. గతంలో వీటిని పాటిస్తామని రష్యా చెప్పింది’’ అని వ్యాఖ్యానించారు.  

జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

మరోవైపు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ మాత్రం తమ నుంచి కిమ్‌కు గిఫ్ట్‌ వెళ్లిందని ధ్రువీకరించింది. ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ ‘‘ఆ బహుమతి ఇరుదేశాల మధ్య సంబంధాలకు చిహ్నం’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే రష్యాకు ఆయుధ సాయం చేస్తోందని ఉ.కొరియాపై అమెరికా గుర్రుగా ఉంది. కానీ, ఈ ఆరోపణలను మాస్కో, ప్యాంగ్‌యాంగ్‌ తిరస్కరించాయి.

సెప్టెంబర్‌లో పుతిన్‌, కిమ్‌ మాస్కోలో సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఆరస్‌ సెనేట్‌ లిమోసిన్‌ కారును చూసి కిమ్‌ ముచ్చటపడ్డారు. దీంతో పుతిన్‌ ఆయన్ను వాహనంలో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్‌ చేశారు. ఇటీవల ఆ కారును కిమ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫిబ్రవరి 18న కిమ్‌ తరఫున ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రతినిధి పాక్‌ జోంగ్‌ ఛోన్‌ ఆ కార్‌ను అందుకొన్నారు. ఈ సందర్భంగా జోంగ్‌ రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు