Supreme Court: 100% వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కుదరదు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది.

Published : 27 Apr 2024 13:12 IST

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ తోసిపుచ్చింది. ఏ వ్యవస్థనైనా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయమైన సంశయవాదానికి దారి తీస్తుందని హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను 100 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని తేల్చి చెప్పింది.

Tags :

మరిన్ని