TS News: మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి: ఎన్‌డీఎస్‌ఏ

మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న ఏడోబ్లాకులోని అన్నిగేట్లను పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే.. కటింగ్ ద్వారా తొలగించాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ స్పష్టంచేసింది.

Published : 08 May 2024 12:05 IST

      మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న ఏడోబ్లాకులోని అన్నిగేట్లను పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే.. కటింగ్ ద్వారా తొలగించాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. నీటి ఒత్తిడి పడకుండా మూడు అనకట్టల్లోని అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది. దెబ్బతిన్న పియర్స్‌కు పగుళ్లు ఎక్కువగా రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, బాయిలింగ్ పాయింట్స్‌కి గ్రౌటింగ్ చేయడం సహా దిగువున షీట్ పైల్స్ ఏర్పాటుచేయాలని, సీసీ బ్లాకులను పూర్తిగా పునరుద్ధరించాలని తెలిపింది. మేడిగడ్డతో పాటు మిగిలిన రెండుబ్యారేజీలకు నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో మరిన్ని పరీక్షలు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు