KTR: క్రిశాంక్‌ పెట్టిన సర్క్యులర్ తప్పయితే నేను జైలుకు వెళ్తా..!: కేటీఆర్‌

భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. క్రిశాంక్‌ చేసింది తప్పయితే తాను జైలుకు వెళ్తానన్నారు.

Published : 08 May 2024 15:17 IST

భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిశాంక్‌ చేసింది తప్పయితే తాను జైలుకు వెళ్తానన్నారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలన్నారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు