Fake votes: ఓటు హక్కుపై వేటు.. అదే జగన్‌ రూటు!

దాష్టీకాలే ఊపిరిగా రాష్ట్రాన్ని ఏలిన జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు. గిట్టని ఓటర్లను జాబితాల్లోంచి తీసి పారేయించారు. దొంగ ఓట్లను గంపగుత్తగా చేర్పించారు. అలా పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో పదోతరగతి పిల్లల పేర్లు ఓటరు జాబితాలో చేరాయి. 

Published : 27 Apr 2024 14:45 IST

దాష్టీకాలే ఊపిరిగా రాష్ట్రాన్ని ఏలిన జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు. గిట్టని ఓటర్లను జాబితాల్లోంచి తీసి పారేయించారు. దొంగ ఓట్లను గంపగుత్తగా చేర్పించారు. అలా పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో పదోతరగతి పిల్లల పేర్లు ఓటరు జాబితాలో చేరాయి. ఒంగోలులో 16 ఇంటి నెంబర్లతో ఏకంగా 500 ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా తిమ్మాపురం జనాభా 207. కానీ, ఆ ఊళ్లో ఓటర్లు 535 మంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త ఓట్ల నమోదుకు తొమ్మిది నెలల్లో ఏకంగా 50వేల దరఖాస్తులొచ్చాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు మాయమైతే వైకాపా వర్గీయులకేమో ఒకటికి రెండు ఓట్లు వచ్చాయి. వైకాపా ఏలుబడిలో ఓటర్ల జాబితాల్లో సాగిన అడ్డగోలు అరాచకాలకు అద్దంపట్టే ఇలాంటి దృష్టాంతాలు ఎన్నెన్నో. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు