AP Roads: మంత్రి ఉషశ్రీకి తప్పని రోడ్డు తిప్పలు.. వీడియో వైరల్‌

అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. కుందుర్పి మండలం కొల్లరహట్టిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఉషశ్రీ బయల్దేరగా.. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండి.. మంత్రి కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి తన అనుచరులతో కలిసి ద్విచక్రవాహనంపైనే గమ్యస్థానానికి చేరుకున్నారు. మంత్రి  బైక్ పై ప్రయాణించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Updated : 22 Jan 2023 13:50 IST
Tags :

మరిన్ని