‘పుష్ప’ జాలిరెడ్డి ‘గురుదేవ్‌ హోయిసాల’ ట్రైలర్‌ చూశారా?

‘పుష్ప’లో జాలిరెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ నటుడు ధనుంజయ. ఆయన నటించిన తాజా కన్నడ చిత్రం ‘గురుదేవ్‌ హోయిసాల’. అమృత అయ్యర్‌ కథానాయిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన  ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ధనుంజయ ఇందులో పోలీస్‌ పాత్రలో కనిపించి మెప్పించారు. ‘సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పోలీస్‌ అవసరం ఉంది. కానీ, పోలీసులు సమస్యల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు’ అంటూ సాగిన ట్రైలర్‌ ఆద్యంతం అలరించేలా ఉంది. మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Published : 20 Mar 2023 20:33 IST

మరిన్ని