WTC Final 2023: టీమిండియా పదేళ్ల కరవు తీరేనా..?

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ (WTC Final 2023)కు రంగం సిద్ధమైంది. జూన్ 7 నుంచి 11వ తేదీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్  మైదానం వేదికగా నిలవనుంది. పదేళ్ల నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గని టీమిండియా.. ఇందులో గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలన్న కసితో ఉంది. తుదిపోరులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది.

Published : 06 Jun 2023 22:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు