KA Paul: రేవంత్‌ను తక్షణమే అరెస్టు చేయాలి: తీవ్రంగా మండిపడ్డ కేఏ పాల్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) తీవ్రంగా మండిపడ్డారు. ప్రగతి భవన్‌ను కాల్చివేయాలన్న రేవంత్‌ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా.. ఆయన తీరు మారలేదని ధ్వజమెత్తారు. రూ.వేల కోట్లు లంచం ఇచ్చి రేవంత్‌ పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆ పదవి నుంచి ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ (Congress)ని పాల్‌ డిమాండ్‌ చేశారు.

Published : 08 Feb 2023 15:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు