Kamineni Srinivas: అలాంటి పోలీసులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం: కామినేని శ్రీనివాసరావు

స్థానిక ఎమ్మెల్యే అక్రమాలకు వంతపాడటం సహా అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రశ్నించినవారిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు.

Published : 05 May 2024 22:07 IST

స్థానిక ఎమ్మెల్యే అక్రమాలకు వంతపాడటం సహా అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రశ్నించినవారిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. నియోజకవర్గంలో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ముఖ్య కర్తవ్యమని ఆయన చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అండతో ఇసుక దందా భారీగా జరుగుతోందని మండిపడ్డారు. ప్రజల స్పందన చూశాక తాను విజయం సాధించడంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు.

Tags :

మరిన్ని