Mulugu: ఇంకా జలదిగ్బంధంలోనే కొండాయి ప్రాంతం

ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో.. కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గినప్పటికీ ఈ గ్రామాల్లో ఇంకా వరద తగ్గలేదు. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో కొండాయి ప్రజలు.. గ్రామ పంచాయతీ భవనంపై ఉండి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరి అవస్థలు తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. హెలీకాప్టర్‌ ద్వారా భోజనం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు. 

Updated : 28 Jul 2023 17:52 IST

Tags :

మరిన్ని