Nizamabad: పాలకుల నిర్లక్ష్యం.. పరిశ్రమలు రాక వృథాగా మారిన లక్కంపల్లి సెజ్‌ ప్రాంతం

నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్.. పరిశ్రమలు రాక వెలవెలబోతోంది. ప్రత్యేక ఆర్థిక మండలి- సెజ్ ఏర్పాటుతో అనేక పరిశ్రమలు వస్తాయని నమ్మి రైతులు ఇచ్చిన భూములు వృథాగా మారాయి.

Published : 24 Apr 2024 10:47 IST

అరచేతిలో వైకుంఠం చూపించారు అంటే ఏమో అనుకుంటాం. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్ విషయంలో ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ప్రత్యేక ఆర్థిక మండలి- సెజ్ ఏర్పాటుతో అనేక పరిశ్రమలు వస్తాయని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని నాటి పాలకులు ఎన్నో మాయమాటలు చెప్పారు. ఇవన్నీ నమ్మిన రైతులు భూములిచ్చారు. నాయకుల మాటలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు రాకపోవడంతో సేకరించిన వందలాది ఎకరాల భూమి అడవిని తలపిస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు