Ambati: మా మామ.. మానవత్వం ఏమాత్రం లేని వ్యక్తి!: మంత్రి అంబటి అల్లుడు గౌతమ్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే ఎమ్మెల్యే వంటి పవిత్రమైన పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 05 May 2024 16:01 IST

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే ఎమ్మెల్యే వంటి పవిత్రమైన పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. అంబటి రాంబాబు రెండో అల్లుడు గౌతమ్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. తన మామ అయిన అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దంటూ గౌతమ్‌ ప్రజలకు సూచించారు. ఆ పదవికి అంబటి ఏ మాత్రం అర్హులు కాదని గౌతమ్ తన వీడియోలో విమర్శించారు. మంచి, మానవత్వం, మర్యాద ఏ మాత్రం లేని అంబటికి ఓటు వేస్తే.. ఆ ఓటు వృథా అవుతుందని అన్నారు. 

Tags :

మరిన్ని