‘మహా సంక్షోభం’..రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఠాక్రే సర్కారుకు నోటీసులు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టుకు ఎందుకు బదిలి చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. శివసేన శాసనసభా పక్ష నేతగా తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రి, తిరుగుబాటు నేత ఏక్ నాథ్  శిందే దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో పరిస్థితులు సరిగా లేవని, ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని శిందే తరపు న్యాయవాది తెలిపారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

Published : 27 Jun 2022 17:59 IST

Tags :

మరిన్ని