Kailash Satyarthi: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కైలాష్‌ సత్యార్థి

పచ్చని ప్రపంచం కోసం  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్విరామంగా కృషిచేస్తున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకువచ్చిన వృక్షవేదం, హరితహాసం పుస్తకాలను కైలాస్ సత్యార్ధికి అందించి సత్కరించామని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.

Published : 22 Jul 2023 16:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు